
* ఇద్దరు దుర్మరణం.. మరికొందరికి తీవ్రమైన గాయాలు
* శిథిలాల కింద బాధితులు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. శిథిలాల కింద చాలా మంది ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse). ఈ ఘటనలో పలువురు శిథిలాల (rubbles) కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఎనిమిది మందిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సిబ్బంది తీవ్రంగా గాలిస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియరాలేదు. కానీ, ఒక కుటుంబంలో పది మంది ఉంటారని, వారి పరిస్థితి ఏంటో తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దర మృతి చెందినట్లు తెలుస్తోంది.
……………………………………….