
– షెడ్యూల్ కులాల బాలబాలికలకు..
– 1వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముఖ పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల బాల బాలికలకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా ఉపసంచాలకులు ప్రవీణ్‌కుమార్ ఒకప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రామంతాపూర్, బేగంపేటలోని హెచ్‌పీ ఎస్‌లో ఉచిత విద్య అందించనున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన వారికే అవకాశం. మీసేవ ద్వారా నివాస సర్టిఫికెట్, మునిసిపల్/తహసీల్దార్ ఆఫీస్‌ల నుంచి జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. విద్యార్థులు 01-06-2018 నుంచి 31-05-2019 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఎంపిక సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలని, రేషన్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, పాస్ఫొటోను దరఖాస్తుకు జతచేయాలన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్థి శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న బాల బాలికలకు స్కాలర్‌షిప్‌నకు అర్హులన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు ఆగస్టు 10న లక్డీకపూల్‌లోని కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి ఎంపిక చేస్తారని, ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తులను నాంపల్లి చంద్రవిహార్ కాంప్లెక్స్ 8వ అంతస్తులో ఉన్న జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్థి శాఖాధికారి కార్యాలయంలో ఉచితంగా పొందచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 8న సాయంత్రం 5.00 గంటల లోపు వ్యక్తిగతంగా చంద్రవిహార్ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో సమర్పించాలని ప్రవీణ్‌కుమార్ సూచించారు.
………………………………………….