* డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుంది
* 1995లోనే ఐటీపై దృష్టి సారించా
* పీపీపీ పద్ధతిలో హైటెక్‌సిటీ నిర్మించా
* భవిష్యత్‌లో డ్రోన్లది ప్రత్యేక పాత్ర
* ఎవరైనా తప్పు చేస్తే నిమిషాల్లో పట్టుకుని శిక్షిస్తాం
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, అమరావతి : భవిష్యత్‌లో డ్రోన్స్(Drones) .. గేమ్ ఛేంజర్స్ అవుతాయని, డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుందని సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu) తెలిపారు. మంగళవారం అమరావతిలో డ్రోన్ సమ్మిట్ -2024ను(Drone Sammit) ఆయన ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు. పౌర విమానయానశాఖ, డీఎఫ్ఐ, సీఐఐ బాగస్వామ్యంతో నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. ఇటీవల విజయవాడ(Vijayawada Floods) వరదల్లో డ్రోన్లు వినియోగించామని తెలిపారు.
విజయవాడలో వరదలప్పుడు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించామని వెల్లడించారు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక ఐటీపై దృష్టిని సారించానని పేర్కొన్నారు. పీపీపీ పద్ధతిలో హైటెక్‌సిటీ(Hightech City)ని నిర్మించానని వివరించారు. డ్రోన్లతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చని వివరించారు. ఇప్పుడు నిజమైన సంపద అంటే డేటా అని అన్నారు. ఏపీలో టెక్నాలజీని విస్తృతం చేస్తున్నామని, ఎవరైనా తప్పు చేస్తే నిమిషాల్లో పట్టుకుని శిక్షిస్తామని వెల్లడించారు.
………………………………………………………………..