World Peace Day
World Peace Day: ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రపంచ శాంతి సాధనలో కవులు, రచయితల పాత్ర కీలకమని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు అన్నారు. యుద్ధాలకు వ్యతిరేకంగా, శాంతి కోసం మేధావులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిపై కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కే. యాదవ రెడ్డి, డాక్టర్ డి. సుధాకర్, జి. నాగేశ్వరరావు, డాక్టర్ కాచం సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కే. యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు వెంటనే ఆగాలని అన్నారు. రక్షణ బడ్జెట్లకు కేటాయించే నిధులను విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. దేశాల మధ్య స్నేహ సంబంధాలు, పరస్పర సహకారం పెంపొందించాలని కోరారు.
కేవీఎల్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ శాంతి కోసం ఉద్యమించాలని అన్నారు. జి. నాగేశ్వరరావు కవులు, రచయితలు తమ రచనలకు మరింత పదును పెట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ కాచం సత్యనారాయణ సమాజంలో కవుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సీనియర్ ఉద్యమ నాయకుడు నరహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి గురించి ఆలోచించినప్పుడే సమాజంలో శాంతి బలపడుతుందని అన్నారు.
కవితా పఠనం
కవి సమ్మేళనంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థి కొండూరి కోటిబాబు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి అంశంపై తాను రచించిన కవితను సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సలీమా, కమలా రెడ్డి, బొమ్మగాని నాగభూషణం, కడారి శ్రీనివాస్, రాపోలు సుదర్శన్, రామడుగు రాంబాబు, కొండూరి కోటిబాబు, హర్షత్, మహేష్, పోలగాని రవికిషోర్, వెంకట్, అనూష, రామనారాయణ, జేకే శ్రీనివాస్, సుధావన్, శివయ్య, నాగేశ్వర్, సాంబశివరావు, రామచంద్రారెడ్డి, పి. వెంకటేశ్వర్లు, ఇరుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
