* లిఫ్ట్ ఇచ్చి.. కారులో తిప్పుతూనే అఘాయిత్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాగర్ కర్నూలులో నిన్న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే హైదరాబాద్(Hyderabad)లో మరో దారుణం చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన ఓ విదేశీ యువతిపై సాముహికంగా లైంగిక దాడికి (Gang Rape) పాల్పడ్డారు దుండగులు. పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో నిన్న రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని సందర్శించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చింది. మీర్పేట మందమల్లమ్మ సెంటర్ వద్ద గతరాత్రి ఒంటిరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన కొందరు కామాంధులు.. తాము లిఫ్ట్ ఇస్తామని యవతిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు కారులో ఎక్కింది. అనంతరం ఆమెను పహడీ షరీఫ్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు(Car)లోనే యువకులు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మెుత్తం ముగ్గురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఘటన జరిగిన నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమెను వదిలేసి పరారయ్యారు. ఘటన జరిగిన కాసేపటికి తేరుకున్న యువతి.. నేరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
