
* గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్.
ఆకేరు న్యూస్, ములుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉన్నత చదువులు చదవాలి అని విద్యార్థులకు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ సూచించారు. బుధవారం ఆయన ములుగు జిల్లా లో ని మదనపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జగ్గన్న పేట లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలను తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యాలయంలో పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. వర్షా కాలం లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ తరువాత మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందుతుందా లేదా అని ఆరా తీశారు.విద్యలో,ఆటల్లో పాటల్లో సహకరించి వారిని ఉన్నత స్థాయికి చేర్చే విధంగా ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు.గురుకులాల్లో విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు మంత్రి ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాటు ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి గండ్రత్ జయాకర్, యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్, యూత్ నాయకులు రమణాకర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………..