* టీటీడీ చైర్మన్ ను కోరిన కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడును కోరారు. గురువారం హైదరాబాద్ లో ఆమె బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు ను కలిసారు. ఈనెల 30న హరితామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.
…………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
