
* నాకు మూడు సార్లు అన్యాయం చేశారు
* ఆస్తులు అమ్మి టీడీపీ కోసం పనిచేశాను
* నా దగ్గర ఉన్నది ఇంక కిడ్నీలు, లివరే..
* రాజకీయాలు చేసే ఓపిక లేదు..
* టీడీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా
* నాకు శ్రద్దాంజలి ఘటించండి అంటూ 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బయ్య వాకౌట్
* బాపట్ల చీరాల మున్సిపల్ చైర్మన్ ఎంపికలో కీలక పరిణామాలు
ఆకేరు న్యూస్, బాపట్ల : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల చీరాల మున్సిపల్ చైర్మన్ ఎంపికలో కీలక మలుపు చోటుచేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా మించాల సాంబశివరావు ఎంపికయ్యారు. ఆయన పేరును ఎంపీ కృష్ణ ప్రసాద్ ప్రతిపాదించారు. దీంతో 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బయ్య వాకౌట్ చేశారు. తనకు మూడుసార్లు అన్యాయం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సుబ్బయ్య మాట్లాడుతూ ఏదైనా విషం ఇచ్చి చంపేయండి చంద్రబాబుగారూ.. అంటూ ఆవేదన వెలిబుచ్చారు. మూడుసార్లు అన్యాయం చేశారని వాపోయారు. ఆస్తులు అమ్మి టీడీపీ కోసం పనిచేశానని, 14 ఆస్తులు ఉంటే 12 ఆస్తులు అమ్ముకున్నానని అన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. టీడీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నా అన్నారు. మీకు, మీ పార్టీకో దండం అన్నారు. ఇక రాజకీయాలు చేసే శక్తి కూడా లేదని, అంతా నాశనం అయిపోయిందని ఉద్వేగానికి గురయ్యారు. తన దగ్గర ఉన్నది ఇంక కిడ్నీలు, లివరే అన్నారు. వైసీపీ సుబ్బారెడ్డి తనకు ఎంతో దగ్గర అని, తన వాళ్లను కాదని టీడీపీలో ఉన్నానని అన్నారు. ఈరోజు నుంచి సుబ్బయ్య అనేటోడు లేడని, శ్రద్ధాంజలి ప్రకటించుకోండని వెల్లడించారు.
……………………………………………..