Gold Silver Prices Today
కొనుగోలుదారులకు ఊరట
పసిడి ప్రియులకు గుడ్న్యూస్..
అకేరు న్యూస్ హైదరాబాద్ : ఒక్కరోజే రూ.3 వేలకుపైగా తగ్గిన బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఒక్కరోజులోనే రూ.3 వేలకుపైగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,900 తగ్గి రూ.1,46,500గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2.60 లక్షలకు చేరింది.
వరుసగా పెరుగుతున్న పసిడి, వెండి ధరలకు బ్రేక్ పడటంతో.. రాఖీ పౌర్ణమి, శుభకార్యాల నేపథ్యంలో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పులు ఉండే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
