Visakhapatnam 4 Year Old Girl Kidnapping
* సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
అకేరు న్యూస్ విశాఖపట్నం : అర్ధరాత్రి తల్లిదండ్రులతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చిన్నారి అపహరణ విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ సమీపంలోని బస్టాప్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని యువతీ, యువకుడు అర్ధరాత్రి సమయంలో అపహరించినట్లు సమాచారం.
విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ దంపతులు షాపులకు ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన వారు.. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
సీసీటీవీలో కీలక ఆధారాలు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఓ యువతీ, యువకుడు స్కూటీపై వచ్చి చిన్నారిని తీసుకెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం.
వారిని ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడికి చెందిన ఉపేంద్రగా పోలీసులు అనుమానిస్తున్నారు.
AP39 CL 1728 నంబర్ గల స్కూటీపై చిన్నారిని గాజువాక వైపు తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
చిన్నారిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
