AP Telangana Rain Alert
* బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
* సెప్టెంబర్ 2 వరకు వర్షాలు!
అకేరు న్యూస్ హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఆగస్టు 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 2 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపు, ఎల్లుండి పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఆగస్టు 29–31 వరకు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఇక తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షం లేదా ఉరుములతో కూడిన వాతావరణం ఉండొచ్చని ఐఎండీ స్థానిక అంచనాలు సూచిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
