* 17 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రాజధానిలో ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ(Kachiguda), హైదరాబాద్(Hyderabad), మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఇవి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 17, 24 తేదీల్లో.. కాచిగూడ-కొట్టాయం రైలు (07131/07132) కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. నవంబర్ 18, 25 తేదీల్లో కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (07133/07134) రైలు సోమవారం రాత్రి 8.50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొట్టాయం చేరుతుంది. కాచిగూడ(Kachiguda) నుంచి షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడనూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలవా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది. ఈ నెల 19, 26 తేదీలలో..హైదరాబాద్-కొట్టాయం-హైదరాబాద్ (07135/07136) రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుతుంది. హైదరాబాద్ (Hyderabad) నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. నవంబర్ 16, 23, 30వ తేదీల్లో సికింద్రాబాద్- కొట్టాయం-సికింద్రాబాద్ (07137/07138) రైలు సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ(Nalgonda), మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. ఇవి కాక మరిన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
……………………………………………