Published:
* రైతు భరోసా నిధులు విడుదల
ఆకేరున్యూస్ , హైదరాబాద్ : రేవంత్ సర్కార్ రాష్ట్రం లోనిరైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది.1189.43 కోట్లను రైతు భరోసా నిధులను విడుదల చేసింది.ఇంతకు ముందు . ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్.. గురువారం నాడు మరికొంత మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేసింది. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతుల ఖతాల్లో రూ. 6404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే.. 106 లక్షల ఎకరాకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
………………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
