* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
* యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ఆకేరు న్యూస్ ,హనుమకొండః దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ ( Rahul Gandhi కుటుంబం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Nayini Rajender Reddy )అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ ఎన్నో సార్లు జైలుకు వెళ్లాడని దేశం కోసం ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీలు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తుచేశారు. దేశంలో ప్రజల కష్టాలను కళ్లారా చూడడానికే రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర చేశారని నాయిని అన్నారు.రాహుల్ గాంధి జన్మదినం సందరర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.రాహుల్ గాందీ ఆశీస్తులతో రాష్ట్రంలో పేదల కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
