* త్వరలోనే చేనేత రుణమాఫీ
* మంత్రి తుమ్మల కీలక ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో రూ.22 వేల కోట్ల నగదు జమ చేసినట్లు చెప్పారు. తాజాగా… తెలంగాణలోని నేతన్నలకు సైతం మంత్రి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాతల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ అమలుచేస్తామన్నారు. రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద రూ.428 కోట్లు విడుదల చేశామన్నారు. నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల వెల్లడిరచారు.
………………………………