* కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేపటి నుంచి జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్టు చేశారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని స్పీకర్ను కోరారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
