
-భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: సొంతింటిలో నివసించాలని పేదల కలల సౌధానికి సర్కారు సాయం చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో నిరుపేదల కలల సాకారం చేస్తున్నామని, లబ్దిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని సూచించారు. అధికారులు లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాలలో పూర్తి సహకారం అందించాలని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ లో ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో జరిగిన జనగామ నియోజక వర్గస్థాయి సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్ (స్థానిక సంస్థలు), రోహిత్ సింగ్ (రెవెన్యూ), లతో కలిసి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని జనగామ మున్సిపాలిటీ, జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 816 మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో నిరుపేదల కలల సాకారం చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో భూ భారతి సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డు ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామని, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టి నిరుపేదలను ఆదుకున్నామన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూ.లకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వంటి ప్రభుత్వ పధకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయం పండుగలా చేపట్టేందుకు రైతన్నకు పెద్ద పీట వేశామన్నారు. రైతులు పండించిన ధాన్యం కు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసామన్నారు. నిరుపేదలు ధనికులు లాగా సన్నబియ్యం తో కడుపునిండా భోజనం చేయాలని, సన్నాలు పండించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రూ.500లు బోనస్ గా ఇచ్చామన్నారు. రైతులకు రుణమాఫీ తో పాటు రైతు భరోసా పథకం అమలు చేశామన్నారు. లబ్దిదారులు ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు తో స్వయంగా ఇంటికి వచ్చి ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీ సి సి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆర్.టి.ఐ. సభ్యులు అభి గౌడ్, ఆర్డీఓ గోపిరామ్, హౌసింగ్ పీడి మాతృ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జనగామ నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారులు పాల్గొన్నారు.
…………………………………………………