* జిష్టుదేవ్ వర్మ పర్యటనలో పాముకాటుకు గురైన కానిస్టేబుల్
ఆకేరు న్యూస్, ములుగు : గవర్నర్ జిష్టు దేవ్‌వర్మ ములుగు (Mulugu district) జిల్లా పర్యటనలో పాముకాటుకు గురైన కానిస్టేబుల్ ను పరామర్శించారు. ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ప్రశాంత్‌ను బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గవర్నర్ వెంట జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ షబరిశ తదితరులు ఉన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రేహౌండ్స్ బలగాలతో అధికారులు ముందస్తుగా భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరిం చారు. కాగా, వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ (Constable) గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తికి పాము కాటు(Snake bite) వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి వైద్యమందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు.
——————————–