* నిజామాబాద్ జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతించెందారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం చిట్లి గ్రామానికి చెందిన వంశీ (19), నిజామాబాద్ కుమార్ దల్లి ప్రాంతానికి చెందిన రాజేష్ (20) ఇద్దరు యువకులు.. తమ స్నేహితుడైన రాజేష్ అనే మరో యువకుడితో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ సమీపంలోగల ఓ రైస్ మిల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వంశీ, రాజేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
——————————–