* కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే తొలుత కూల్చారు
* మా కుటుంబ సభ్యులకు అక్రమ నిర్మాణాలుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా
* హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం
* 111 జీవో కొనసాగుతుంది
* కవితకు బెయిలు ఎందుకు వచ్చిందో తెలుసా
* కేటీఆర్ ను డిస్ క్వాలిఫై చేయాలి
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని, ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (TELANGANA CHIEF MINISTER) స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత పల్లంరాజు (CONGRESS LEADER PALLAMRAJU) నిర్మాణాన్నే తొలుత కూల్చారని వెల్లడించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బడాబాబులు కొందరు చెరువులను మింగేసి.. భవనాలు కట్టుకున్నారని, దుర్గంధాన్ని చెరువుల్లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులకు అక్రమ నిర్మాణాలుంటే తానే దగ్గర ఉండి కూలగొట్టిస్తానన్నారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ (POLICE STATION STATUS) ఇస్తామని చెప్పారు. పార్టీలకతీతంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుందన్నారు. 111 జీవో కొనసాగుతుందని పేర్కొన్నారు.
* కేటీఆర్ ను డిస్ క్వాలిఫై చేయాలి
జన్వాడ ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకున్నామని కేటీఆర్ (KTR) ఇప్పుడు అంటున్నారని, ఆ విషయాన్ని అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఆయనను ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయాలన్నారు. జన్వాడ ఫామ్ హౌస్‌కు పంచాయితీ అనుమతులు కూడా లేవన్నారు.
* అందుకే కవితకు బెయిలు
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ (BRS) ఓటు బ్యాంకును బీజేపీ(BJP)కి ఆ పార్టీ నేతలే బదిలీ చేశారని కవిత(KAVITHA)కు అందుకే ఐదు నెలల్లోనే బెయిలు వచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న.. కేజ్రీవాల్(KAJRIWAL), సిసోడియా(SISODIA)కు నెలలు దాటినా బెయిలు రాలేదన్నారు. ఇదిలా ఉండగా, రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్ లో ఇవ్వాలని, అందరికీ రుణమాఫీ జరిగి తీరుతుందన్నారు.