* డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచం
* వైద్య రిపోర్టులు కూడా ఆ కార్డులో పొందుపరుస్తాం
* కుటుంబపెద్దగా మహిళను పొందుపరిచాం
* ఏది పడితే అది వాగుడు వద్దని ప్రతిపక్షాలకు సూచన
* మూసీని అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు బతుకుతారని చురకలు
* హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుతున్నాం
* బురద జల్లుతూ బావబామ్మర్దులు తిరుగుతున్రు
* సబితమ్మ పేద అరుపులొద్దు.. మీ ఫామ్ హౌస్‌లు కూల్చాలా వద్దా చెప్పు..
* ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అర్హత కలిగిన వారికి ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం వల్ల పేదలు పదేళ్లుగా ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యారన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందాలన్నదే తమ లక్ష్యమని, కార్డులు ఉపసంహరించుకున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
30 శాఖల సమాచారమంతా ఒకేచోట
గత బీఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విసిరి వేసారిన ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ పథకాలు, రేషన్‌కార్డు, హెల్త్ ప్రొఫైల్.. ఇలా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వారు నిక్షిప్తంగా చేసుకోవడం వల్ల అసలు లబ్ధిదారులు ఎవరో తెలియడం లేదన్నారు. 30 శాఖల సమాచారాన్ని కలిపి.. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్ఆనమని రేవంత్ తెలిపారు. వన్ నేషన్.. వన్ రేషన్.. విధానంలా వన్ స్టేట్.. వన్ కార్డును తెస్తామన్నారు. 119 నియోజకవర్గాల్లో 239 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని వివరించారు. ప్రభుత్వ పథకాల అమలుకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన ఆధారే ఆధారమైంది
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ తెచ్చిన ఆధారే ఆధారమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో డిజిటల్ కార్డు ద్వారా చిరునామా మారినా ఆ ప్రాంతంలోనే మీకు పథకాలు అందుతాయన్నారు. ప్రతి మనిషీకి ఒక గుర్తింపు నంబర్ ఇస్తామని వివరించారు. మహిళల పేరు మీద డిజిటల్ కార్డులు అందించి మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. వైద్య రిపోర్టులు కూడా ఆ కార్డులో పొందుపరుస్తామన్నారు.
అడ్డగోలు అప్పులు.. విపరీతరమైన తప్పులు..
ఏది పడితే అది వాగుడు వద్దని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. ఆరోజు మూసీ పరివాహక ప్రాంతాన్ని అమ్ముకుని, ఇప్పుడు ప్రభుత్వ భూమని తెలియడంతో కొన్నవాళ్లంతా కాలర్ పట్టుకుంటారని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మూసీని అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు బతుకుతారని చురకలు అంటించారు. హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుతున్నామన్నారు. మంచి పనులు చేస్తుంటే సహకరించడం మానేసి దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అడ్డగోలు అప్పులు.. విపరీత అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక కంటోన్మెంట్ ప్రజలను మునిసిపాలిటీలో కలపాలని ఆర్డర్ తెచ్చాన్నారు. ఎలివేటేడ్ కారిడార్‌కు అనుమతి తెచ్చామన్నారు. పదేళ్లు ఏలారు.. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు.. వారు మీ ఉద్యోగాలు ఊడపీకిండ్రు అన్నారు.. తాము ఉద్యోగాల నియామకానికి ప్రాధాన్యం ఇ స్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను, వరద సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోతుంటే.. దాని మీద కూడా బురద జల్లుకుంటూ బావ బావమరుదులు తిరుగుతున్నారని విమర్శించారు. సబితమ్మ పేద అరుపులొద్దు.. మీ ఫామ్ హౌస్‌లు కూల్చాలా వద్దా చెప్పు.. అని రేవంత్ ప్రశ్నించారు.
………………………………………………