
* మంత్రి వాకిటి శ్రీహరికి డీటీఎఫ్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్ మక్తల్ ః శిథిలావస్థలో ఉన్న భవనాలకు నూతన భవనాలను నిర్మించి ఇవ్వాలని కోరుతూ డీటీఎప్ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. మంగళ వారం మంత్రి మక్తల్ మున్సిపల్ కేంద్రంలోని పాఠశాలలను సంర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన టీడీఎఫ్ బృందం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని కోరారు. పట్టణంలోని జగ్జీవన్ రాం నగర్లో బీసీ కాలనీల్లో పాఠశాలలకు నూతన భవనాలను నిర్మించాలని వారు కోరారు.యూపీఎస్ ఖానాపూర్ పాఠశాలలో 160 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారని ఆ పాఠశాలకు అదనంగా పోస్టులను మంజూరు చేయాలని వారు కోరారు. అదే విధంగా అద్దె భవనంలో నడుస్తున్న కృష్ణ ప్రాథమిక పాఠశాలకు స్వంత భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. అల్లంపల్లి పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. కృష్ణా మండలం గురుజాలలో 59 మంది విద్యార్థులు ఒకటే గదిలో చదువుతున్నారని అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో
DTF నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర.DTF, జిల్లా అధ్యక్షురాలు హైమావతి,జిల్లా కార్యదర్శి శ్రీ విద్య,DTF మక్తల్ మండల ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………