* వాహన షెడ్డును ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్ సుధారాణి
ఆకేరు న్యూస్ హన్మకొండ: వాహనాల మరమ్మత్తు పనుల్లో వేగం పెంచాలని నగర మేయర్ గ్రేటర్ వరంగల్ (Greater Warangal) మునిసిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) మేయర్ (Mayor) గుండు సుధారాణి (Gundu Sudharani) అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాల సముద్రం లో బల్దియా నిర్వహిస్తున్న వాహన షెడ్డును గురువారం మేయర్ ఆకస్మిక తనిఖీ చేసారు. వాహనాల మరమ్మత్తుల నిర్వహణ తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మత్తుల కోసం షెడ్డుకు వచ్చే వాహనాలలో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసి పంపించాలన్నారు. షెడ్డులోకి వచ్చే వాహనాల నమోదు రిజిస్టర్ ను మేయర్ పరిశీలించారు. ఎన్నికల కోడ్ మూలంగా 44 వాహనాల మరమ్మత్తులో కొంత జాప్యం జరిగిందని అధికారులు మేయర్ కు వివరించారు. వాహనాల లేమి వల్ల శానిటేషన్ (Sanitation) పై తీవ్ర ప్రభావం ఉంటుందని, త్వరగా రిపేర్ చేయాలన్నారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వాహన షెడ్డులో ఏర్పాటు చేయనున్న సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు..
కార్యక్రమంలో ఈ ఈ సంజయ్ కుమార్ డి ఈ సంతోష్ బాబు ఏఈలు మేనక, సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.
———————-