* వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
* రామ్‌నాథ్ కమిటీ నివేదిక ఓకే
* శీతాకాల సమావేశంలో పార్లమెంట్ ముందుకు బిల్లు
ఆకేరు న్యూస్ డెస్క్ : జమిలీ ఎన్నికల(Jamili Elections)కు కేంద్ర కేబినెట్(Central Cabinet) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్(One Nation-One Election)కు ఓకే చెప్పింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath covindh) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో రానున్న శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రానుంది. జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం(Nda Government) ఆశాదృక్పథంతో ఉంది. రెండోసారి బీజేపీ(Bjp) అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఒకే దేశం – ఒకేసారి ఎన్నికల విధానాన్ని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి దాన్ని అమలుచేయాలనే లక్ష్యంతో ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసింది. మొదట లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని కోవింద్ కమిటీ చెప్పింది. ఆ కమిటీ ప్రతిపాదనలను తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి.
…………………………