మహేష్ కుమార్ గౌడ్
* అంబేద్కర్ చౌరాస్తాలో జరిగే ధర్నాకు హాజరవుతారు
ఆకేరు న్యూస్,వరంగల్ : నేడు టీపీసీసీి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హనుమకొండ జిల్లాకు రానున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లా కు వస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం 2 గంటలకు అంబేద్కర్ జంక్షన్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు . రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపి రవ్నీత్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ధర్నాలో పాల్గొంటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారు ..
* ఆ తర్వాత జమ్మికుంటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పారు..
————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
