* ప్రముఖుల శుభాకాంక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ
బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం అన్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో
ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెగా స్టార్ చిరంజీవి మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సందర్భంగా సీఎంను వ్యక్తిగతంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
