
Venkatesh CISF jawan -File Photo
* బస్సు దిగుతుండగా తుపాకీ మిస్‌ఫైర్
* తీవ్ర విషాదం నింపిన అనూహ్య ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బస్సు దిగుతుండగా.. జవాను చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ Gun Mis fire ) అయి.. అతడి తలలోంచి దూసుకెళ్లింది. ఏపీలోని నంద్యాలకు చెందిన వెంకటేశ్ ( jawan Venkatesh ) (34) హైదరాబాదులోని సీఐఎస్ఎఫ్ ( CISF ) బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంగారెడ్డిజిల్లా బీడీఎల్ భానూరులో బెటాలియన్‌కు చెందిన బస్సులో నుంచి దిగుతుండగా, అతడి వద్ద ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. తూటా అతడి తలలోంచి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. బస్సు నుంచి కిందకు దిగుతున్న సమయంలో.. ఆయన వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యి ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తించి.. బెటాలియన్ బస్సులోనే తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. అయితే.. గన్ మిస్ ఫైర్ అయ్యిందా.. లేదా ఇంకేదైనా జరిగిందా అని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య ఘటన జవాను కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
——————-