Pithapuram
* పిఠాపురంలో పర్యటన
Pithapuram: ఆకేరు న్యూస్, పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఫకృద్ధీన్ పాలెం (ఎఫ్‌కే పాలెం)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రూ.73 లక్షల అంచనా వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించారు.
చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్‌ను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా గడిపి చాక్లెట్లు పంచారు. చెరువు పరిసరాల్లోని భారీ వృక్షాల వయస్సు, వాటి పరిరక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో రూ.6 కోట్లతో 11 గ్రామీణ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానికులకు అందుతున్న సేవలపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పవన్ పర్యటనతో ఎఫ్‌కే పాలెంలో సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
