Hanamkonda Pre Primary Recruitment
* జిల్లాలో ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో 39 మంది ఇన్స్ట్రక్టర్లు, 39 మంది ఆయాల నియామకం
* జిల్లాలో మరింత మెరుగ్గా పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ సెక్షన్స్)
* ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ. 8,000, ఆయాకు నెలకు రూ. 6,000 చొప్పున గౌరవ వేతనం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ (ZP) ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విభాగాలను బలోపేతం చేసేందుకు సమగ్ర శిక్ష కింద 39 మంది ఇన్స్ట్రక్టర్లు, 39 మంది ఆయాలను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తూ హన్మకొండ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఎక్స్ అఫీషియో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ. 8,000 గౌరవ వేతనం, ఆయాకు నెలకు రూ. 6,000 చొప్పున గౌరవ వేతనం అందనుంది. అభ్యర్థులు ఉత్తర్వులు అందిన 3 రోజుల్లోగా సంబంధిత మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, విధుల్లో చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్, సమగ్ర శిక్ష చైర్పర్సన్ ఆదేశాల మేరకు జిల్లా ఎంపిక కమిటీ నివేదిక ఆధారంగా ఈ నియామకాలు . తాత్కాలిక ప్రాతిపదికన జరిగాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి భవిష్యత్తులో ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి హక్కులు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నియామకమైన ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ పర్యవేక్షణలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విధుల్లో అలసత్వం వహిస్తే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే తొలగించే అవకాశం ఉంది. నియామకాల ద్వారా హన్మకొండ జిల్లాలోని 39 ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ సెక్షన్స్) మరింత మెరుగ్గా సాగడానికి వీలు కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
* నియామకంలో బి.ఎడ్ కు ప్రాధాన్యత సున్నా….
ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ దరఖాస్తు సమయంలో బీఎడ్, డిఎడ్ ప్రొఫెషనల్ కోర్సులు వాటిలో వచ్చిన మార్కుల ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఆధారంగా నియామకాలు జరుగుతాయని చెప్పినప్పటికీ, ప్రస్తుత నియామకాల్లో కేవలం ఇంటర్ మార్కుల ప్రాతిపదికన 35 మంది నియామకం జరగగా ,డిఎడ్, డి ఈఐడి, పిఎస్టి కోర్సుల ప్రామాణికత ఆధారంగా కేవలం నలుగురు నియామకం జరిగింది. నియామకాల్లో బిఎడ్ తో అప్లై చేసిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
అదేవిధంగా ఆయాల నియామకంలో అభ్యర్థులను ఏడవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని 17 మంది ఆయాలను ఏడవ తరగతి మార్కుల ప్రామాణికతగా ఎంపిక చేసి మిగిలిన 22 మంది ఆయాలను పదవ తరగతి మార్కులు ఆధారంగా ఎంపిక చేశారు.
Hanamkonda Pre Primary School Recruitment
Please tell us what is wrong. Your report will be sent to the website team.
