HANAMKONDA FREE BIRYANI DISTRIBUTION STAMPEDE
* ఉచిత బిర్యాని ప్యాకెట్ల పంపిణీ.. ఎగబడ్డ జనాలు
* సరైన ఏర్పాట్లు చెయ్యని నిర్వాహకులు
* ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి అని ప్రశ్నిస్తున్న ప్రజలు
అకేరు న్యూస్, హన్మకొండ : ఉచితంగా 300 బిర్యానీ ప్యాకెట్లు పంచుతామని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు చేసిన ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.
హనుమకొండ కెయూ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సురభి ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఉచిత బిర్యాని ప్యాకెట్లు పంచుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసి సరైన ఏర్పాట్లు చేయకుండా నిర్వాహకులు చిన్న సందులో ప్యాకెట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం వల్ల ప్రజలు ఒకరికొకరు తోసుకొని తీవ్ర గందరగోళం ఏర్పడింది.
వ్యాపార ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమై పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
