* తెలంగాణ సీఎంకు శుభాకాంక్షల వెల్లువ
* విషెస్ చెబెతూనే కేటీఆర్, హరీశ్ విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం హోదాలో తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TELANGANA CHIEF MINISTER REVANTHREDDY)కి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే(HAPPY BIRTHDAY) రేవంత్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PRIME NARENDRA Modi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ప్రధాని మోదీ పోస్టుకు సీఎం రేవంత్ స్పందించారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు(AP CM CHANDRABABU), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(PAVAN KALYAN), మెగా స్టార్ చిరంజీవి(MEGASTAR CHIRANJEEVI), ప్రముఖ నటి ఖుష్బూ(KHUSBHU) తదితరులు సీఎంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ శుభాకాంక్షలు చెప్పారు.
వారితో బర్త్ డే కేక్ కట్ చేయిస్తా : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా రేవంత్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఏసీబీ ఎప్పుడైనా రావచ్చని ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు విచారణకు వస్తే, ఆ సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానన్నారు. అంతేకాదు.. వారితో మీ బర్త్‌డే కేక్ కూడా కట్చేయిస్తానని చెప్పారు. అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ న్యూస్‌పేపర్ రాసుకొచ్చిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ చేసిన ట్వీట్‌ను ఆయన కేటీఆర్ ట్యాగ్ చేశారు.
ఈరోజైనా అరెస్టులు లేకుండా పాలించండి : హరీశ్‌రావు
ఈరోజైనా నిర్బంధాలు, అరెస్టులు లేకుండా పాలన సాగించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) రేవంత్ కు సూచించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన సీఎం పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదని విమర్శించారు.ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే తాప సభ పెట్టినట్లు ఉందని విమర్శించారు.
…………………………………………….