* శిక్షణ సమయంలోనే నైపుణ్యత సాధించాలి
* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, వరంగల్ : పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలని, శిక్షణ సమయంలోనే నైపుణ్యత సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను పరిశీలించి అధికారుల భోధనా పద్దతిని పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు భోధించిన అంశాలపై ట్రైనీ కానిస్టేబుళ్లని కమిషనర్ ప్రశ్నలు అడిగారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్ భోధనకు సంబందించి ప్రతి అంశంపై పట్టు వుండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయం ఎదురయ్యే సమస్యలను సులభంగా అదిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జితేందర్ రెడ్డి, రమణబాబు, ఇండోర్, అవుట్ డోర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.