* హరీశ్‌రావు రాజీనామా చేయాంటూ ఫ్లెక్సీలు
* క్యాంప్ ఆఫీస్‌పై దాడి
* సీనియర్ ఎమ్మెల్యేకే భద్రత లేకుంటే ఎలా : కేటీఆర్
* ఇది కాంగ్రెస్ మార్క్ పాలన : హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ((Harish Rao) నియోజకవర్గం సిద్దిపేట(Siddipeta)లో రాజకీయంగా ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుచేసింది.. హరీశ్ రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ శ్రేణులు చేస్తున్న ఆందోళనలతో వాతావరణం వేడెక్కుతోంది. రుణమాఫీ చేశాం హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ హరే కృష్ణ సిద్దిపేట (Siddipeta) పట్టణంలో ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో సిద్దిపేటలో అర్ధరాత్రి నుంచీ ఉద్రిక్తత కొనసాగుతోంది.
క్యాంపు ఆఫీస్‌పై దాడి..
ఇదిలాఉండగా.. హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన దుండగులు ఆఫీస్‌పై ఉన్న హరీశ్‌రావు ఫ్లెక్సీని చించివేసి హంగామా చేశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ (Brs) శ్రేణులు క్యాంపు కార్యాలయం చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని విపక్షం ఆందోళన చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు పోలీసులు పహారా కాస్తున్నారని విమర్శిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister Ktr) తీవ్రంగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకే భద్రత లేకుంటే ఎలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడిచేశారని చెప్పారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమన్నారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడిని ఆపకుండా.. నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుందని విమర్శించారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే.. పౌరులకు భరోసా ఏదని ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
——————————————————————-