* తాజాగా అలీ చెప్పింది నిజమేనా?
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : పవన్ కల్యాణ్(Pavan Kalyan).. పరిచయం అక్కర్లేని పేరు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంచలనంగా మారిన పేరు కూడా. ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister)గా కొనసాగుతుండడంతో పాటు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రాజకీయాలను పక్కనపెడితే, సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించారు పవన్. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అతడిని అభిమానులు ఆదరించారు. పవన్‌ను దేవుడిగా అభిమానించే వారూ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈశ్వరా.. పవనేశ్వరా… పవరేశ్వరా.. అంటూ ఓ సందర్భంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) పవన్ కల్యాణ్‌ను కీర్తించారు. అటువంటి పవన్‌కు కమెడియన్ అలీ(Ali) అంటే ఎనలేని అభిమానం.
పవర్‌స్టార్ సినిమాల్లో హీరోహీరోయిన్ల కాంబో సంగతి పక్కనపెడితే.. పవన్ – అలీ(Pavan-Ali) కాంబో గురించే ఎక్కువగా చర్చ జరిగేది. పవన్ సినిమా అంటే కచ్చితంగా అలీ ఉంటాడనే స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. రీల్ లైఫ్ కు భిన్నంగా రియల్ లైఫ్ లో అంతగా ఎవరితోనూ కలవని పవన్.. అలీతో మాత్రం సరదాగా ఉండేవారు. ఎంతలా అంటే పవన్ కోసం కథ రాసే దర్శకులు, అందులో కచ్చితంగా అలీ కోసం కూడా ఏదో క్యారెక్టర్ రాయాల్సి వచ్చేది. కథ పరంగా బాలు(Balu) సినిమాలో అలీకి క్యారెక్టర్ లేకపోతే, ఓ సాంగ్‌లో అతడిని చూపించారు. అంతటి పెవికాల్ బంధం పవన్-అలీది. అలాంటి బంధానికి రాజకీయాలు బీటలు వేశాయి. ఓ సందర్భంలో పవన్ గురించి బాహాటంగానే అలీ నెగెటివ్ గా మట్లాడారు. ఇక అప్పటి నుంచీ పవన్-అలీ.. ఉప్పు-నిప్పుగా ఉంటున్నారని అడపాదడపా చర్చ జరుగుతూనే ఉంది.
ఏపీ ఎన్నికల అనంతరం పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. మరోవైపు అలీ వైసీపీ(YCP)కి రాజీనామా చేశారు. ఇదిలాఉండగా, ఇప్పటికీ సెట్స్ పై పవన్ కల్యాణ్ సినిమాలు ఉన్నాయి. అందులో ఓజీ ఒకటి. అందులో అలీ కూడా నటిస్తున్నారు. సరిపోదా శనివారం(Saripoda Sanivaaram) సినిమా ఫంక్షన్ లో ఈ విషయాన్ని స్వయంగా అలీనే ప్రకటించారు. దీంతో పవన్-అలీ కాంబోను మళ్లీ చూడొచ్చనే ఆశ అభిమానుల్లో చిగురించింది. ఈనేపథ్యంలో అలీ నటించిన ఉత్సవం సినిమా(Utsavam Movie) వేడుకలో మరోసారి అలీ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌తో మీ రిలేషన్ ఎలా ఉందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉందని అలీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్-అలీ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో పవన్ కల్యాణ్ – అలీ మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది అంటూ.. సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
………………………….