* జనసేన పార్టీ మీటింగ్‌లో రాపాక ప్రత్యక్షం
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఆదివారం రసవత్తరమైన సంఘటన చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ అప్పట్లో సంచలనం సృష్టించారు. జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో అధికార పార్టీ వైసీపీతోనే సన్నిహితంగా ఉండడంతో పాటు . జనసేనను వీడి వైసీపీలో కూడా చేరారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రాపాక మళ్లీ జనసేన నిర్వహించిన ఓ సమావేశంలో కనిపించారు. దీంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోనసీమ జిల్లా మలికిపురంలో కూటమి పార్టీలు నిర్వహించిన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో రాజోలు మాజీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానని రాపాక వరప్రసాద్ ప్రకటిస్తానని.. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అనివార్య కారణాల వల్ల జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
…………………………………………..