* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆకేరున్యూస్, అమరావతి: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అనంతపురంలో రాష్ట్రస్థాయిలో వాల్మీకి జయంతి వేడుకలను జరపనుండగా.. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్.. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా వారికి తాను హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు తమ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
