* వాతావరణ శాఖ హెచ్చరిక
* హీటెక్కుతున్న వాతావరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాబోయ్ ఎండలు మండుతున్నాయి. వడగాలులు భయపెడుతున్నాయి. అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకపోతేనే బెటర్. వృద్ధులు.. పిల్లలు మరింత అప్రమత్తం. వాతావరణ శాఖ హెచ్చరిరకలు ఇవి. ఈ మేరకు తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రోజులుగా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. కరీంనగర్, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాల్లో సుమారు 45 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. మరో 9 ప్రాంతాలకు ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఎండల సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.
——————–