* జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఎనిమిది జిల్లాలతో పాటు తెలంగాణ లోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో సహా నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ, భువనగిరి నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ ఈ జిల్లా్లో హై అలర్ఠ్ ప్రకటించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరించింది 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపంది.
జూరాలకు భారీగా వరద నీరు
ఎగువన పడుతున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 12 గేట్లను ఎత్తి వేశారు. నీటి పరిమాణం పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది, దీనితో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల చేస్తున్నారు.విద్యుత్ ఉత్పత్తి కోసం 27.384 క్యసెక్కుల నీటిని విడుదల చేశారు.ఇన్ ఫ్లో 1.02 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో 1.05 లక్షల క్యూససె్కుఉలు జూనాల నుంచి వరద నీరు శ్రీశైలం చేరుకుంటోంది.
……………………………………
