
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఈ నెల 14 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలు పలు జిల్లాలకు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
……………………………………….