* దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు ఎఫెక్ట్
* మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆకేరున్యూస్, విజయవాడ: ఏపీకి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ(Vijayawada)లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఎక్కువ ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చంద్రబాబు(Chandrababu) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం అందుతున్న వరద సహాయక చర్యలతో పాటు, మరోసారి వర్షాలు కురుస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.