మావోయిస్ట్ అగ్రనేత ఏసోబు అలియాస్ రణదేవ్ దాదా
* కేంద్ర కమిటీ సభ్యుల రక్షణ విభాగం ప్లాటూన్ ఇన్చార్జిగా సేవలు
* 40 ఏళ్లుగా 70 ఏళ్ళ వయసులో నక్సలైట్ ఉద్యమంలో కొనసాగుతున్నారు
* ఏసోబు స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం
* ఎన్ కౌంటర్ లో మృతి చెందింది ఏసోబు అని ప్రకటించిన దంతేవాడ ఎస్పీ
* పోలీసుల సమాచారం మేరకు చత్తీస్గఢ్ కు బయల్దేరిన కుటుంబ సభ్యులు
అకేరున్యూస్, వరంగల్: ఇటీవల జరిగిన దంతెవాడ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ఏసుబు అలియాస్ రణదేవ్ దాదా మృతి చెందారు. మావోయిస్టు పార్టీ తొలితరం నేత అలియాస్ జగన్ గా పిలుస్తారు. ఏసోబు కేంద్ర కమిటీ సభ్యుల రక్షణ విభాగం ప్లాటూన్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. 40ఏళ్లుగా ఉద్యమంలో కొనసాగుతూ 70ఏళ్ల వయసులో చత్తీస్ గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందారు. దీంతో ఏసోబు స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దంతెవాడ ఎస్పీ సమాచారం మేరకు ఆయన కుటుంబ సభ్యులు బుధవారం చత్తీస్గఢ్ కు బయలుదేరారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
