
* డెక్కన్ కిచెన్ కూల్చివేత సంఘటనపై నేడు విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఫిలిమ్నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేత సంఘటనపై నేడు (శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి సురేష్ బాబు, నటుడు దగ్గుబాటి రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై విచారణకు హాజరుకావాలని హైకోర్టు వారిని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నేడు (శుక్రవారం) కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వారు కోర్టు విచారణకు హాజరువుతారా! లేదా! అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం నెలకొంది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసువేశారు. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేయించారు. దాంతో మళ్లీ నందకుమార్ దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు ఫిలిమ్‌నగర్ పోలీసులకు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతోపాటు దుగ్గుబాటి కుటుంబం నేడు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలిని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
………………………………………….