
* ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని హైకోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) కు కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు స్మితా సభర్వాల్ వేసిన పిటిషన్పై వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు (KALESWARAM PROJECT) నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఆ నిర్మాణ పురోగతిని సమీక్షించానని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శి హోదాలో మూడు బ్యారేజీల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించినట్టుగా కమిషన్ నివేదికలో ఉన్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లోబడి ఉన్నదని తెలిపారు. క్యాబినెట్ ఎదుట ఫైళ్లు ఉంచలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్ పేరొనడం చెల్లదని తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరారు. హైకోర్టు (HIGH COURT) ఆమెకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.