* ప్రచారానికి అధునాతన వెహికల్
* దాడిలో రాజకీయ కుట్ర ఉందని తేలడంతో అప్రమత్తం
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో జగన్ ను చంపాలన్న కుట్ర కోణం ఉన్నట్లుగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈక్రమంలో సీఎం సెక్యూరిటీ వ్యవస్థను మార్చారు. ముఖ్యమంత్రి భద్రత కోసం హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీతో కూడిన కమాండ్ కంట్రోల్ వెహికల్ అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సులో 360 డిగ్రీస్ కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఇందులో ఏర్పాలు చేశారు. డ్రోన్, అనుమానాస్పదం, అందరి కదలికలను గుర్తించేలా అప్డేటెడ్ టెక్నాలజీతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర 18వ రోజు ప్రారంభమైంది. కాకినాడ జిల్లాలోని రంగంపేట, పెద్దపారం, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ దగ్గరకు చేరుకుంటుంది ఈరోజు బస్సుయాత్ర. మ.3.30కు అచ్చంపేట జంక్షన్ లో సభ జరగనుంది.
——————————