
* లోక్‌సభలో బీజేపీ ఎంపీలు
* హైదరాబాద్, వరంగల్ లోను ఆందోళనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం (HYDERABAD CENTRAL UNIVERSITY LAND ISSUE) గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరింది. ఒకవైపు లోక్‌సభలో బీజేపీ ఎంపీలు గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ (MP LAXMAN) ఈ అంశాన్ని ప్రస్తావించారు. 400 ఎకరాల భూమి అమ్మకాన్ని అడ్డుకోవాలన్నారు. భూములు మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(DARMENDRA PRADHAN)ను కలిశారు. మరోవైపు వరంగల్(WARANGAL)లోను హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. భూముల వేలాన్ని ఆపాలని కాకతీయ వర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ బీజేపీ, బీజేవైఎం ఆందోళన చేపట్టాయి. రాజ్‌భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద గందరగోళం ఏర్పడింది. యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ భూములు వేలం వెయ్యెుద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినదించారు. భూములు వేలంపై ప్లకార్డులు పట్టి నిరసన తెలిపారు. ఇంచు భూమి కూడా వదులుకోమంటూ పెద్దఎత్తున నినదించారు. ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
……………………………………..