
* బెట్టింగ్ యాప్ స్కాంలో విజయ్ దేవరకొండ..ప్రకాశ్ రాజ్.. రానా..మంచు లక్ష్మి
* మొత్తం 29 మందిపై కేసు నమోదు
* రంగంలోకి దిగిన ఈడీ
* టాలీవుడ్ లో టెన్షన్..టెన్షన్..
* ఒక్క క్లిక్ తో జీవితాలు తలకిందులు
* యాప్ మాఫియాకు బలవుతున్న యువత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః బెట్టింగ్ యాప్‌ల ప్రమో షన్లకు సంబందించి అజయ్ దేవర కొండ, రానా,ప్రకాశ్ రాజ్మంచులక్ష్మిలతో సహా మొత్తం 29 మంది సెలబ్రిటీస్ పై ఈడీ కేసులు నమోదు చేసింది. కేసు నమోదు అయిన వారిలో అజయ్ దేవర కొండ, రానా,ప్రకాశ్ రాజ్,మంచులక్ష్మిలతో పాటు ప్రణీత ,నిధి అగర్వాల్,బండారు సుప్రీత, రీతూ చౌదరి,శోభాషెట్టి,వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, శ్రీముఖి తదితరులు ఉన్నారు. వీరందరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ లోని లోని 318(4),112, ఐటీ చట్టం 2000,2008లోని 66డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అమాయకులు జీవితాలతో ఆటలాడుకునే యాప్ మాఫియాల కు వీరందరూ ప్రచారం కల్పించారు. ఎంతో మంది యువత జీవితాలను తలకిందులు చేసిన ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు అయిన సెలబ్రిటీల నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్లు తీసుకుంటారు. ఈ వ్యవహారంతో ఇప్పుడు టాలీవుడ్ లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
వ్యవస్థీకృతైన మాఫియా
బెట్టింగ్ యాప్ అనేది ఓ వ్యవస్థీకృతమైన మాఫియీ.. అంతర్జాతీయ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు వ్యాపించి ఉంది. 5జీ టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా యాప్ లను నిర్వహిస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు, మొదట్లో యాప్ లు ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత్ సదరు వ్యక్తులకు ఈజీగానే డబ్బులు అందిస్తారు. తరువాత వారు అలవాటు పడ్డాక ఇక డబ్బులు చెల్లించారు. ఆయా యాప్ లో మళ్లీ కన్నించకుండా చేస్తారు. ఉన్నదంతా దోచుకునే దాకా వదలరు
ఒక్క క్లిక్ తో జీవితాలు తారుమారు
డబ్బు ఆశతో బెట్టింగ్ లో పాల్గొనే వారికి ఒక్క క్లిక్ తో వారి జీవితాలు తారుమారు అవుతున్నాయి. అప్పుల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు,డాక్టర్లు.. ఉద్యోగులు.. వ్యాపారులు, సామాన్య జనాలు ఇలా ఎంతో మంది బెట్టింగ్ యాప్‌లకు బానిసలయ్యారు పుట్టగొడుగు్లా పుట్టుకొస్తున్న ఈ యాప్‌లపై ఇప్పుడు ఈడీ అధికారులు సీరియస్ గా ఉన్నారు.
……………………………………………………………….