* హైదరాబాద్‌లో పొలిటికల్ హైటెన్షన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిన్నటి నుంచీ హైదరాబాద్‌లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(PADI KAUSHIKREDDY)తో వేడుక్కిన రాజకీయం రాత్రి వరకూ ఉత్కంఠగానే ఉంది. కౌశిక్ రెడ్డి, హరీశ్‌రావు(HARISHRAO) తదితరులు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. బంజారాహిల్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను గురువారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు, హరీశ్‌రావును గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు పోలీసులు. రాత్రికి ఆయా నేతలను విడుదల చేశారు. కాగా.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరో్జు ట్యాంక్‌బండ్(TANKBUND)పై ధర్నాకు బీఆర్ఎస్ (BRS) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA)ను హౌస్ అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వివేకానంద ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో పొలిటికల్ హైటెన్షన్ ఈరోజు కూడా కొనసాగుతోంది.
…………………………………..