* ఎనిమిది మంది మావోయిస్టులు హతం
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఉండగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
