* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్ : ఆపరేషన్ స్మైల్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 161 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గత నెల జనవరి మొదటి తారీకు నుండి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 161 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించడం జరిగింది. ఇందులో 137 మంది బాలలు, 24మంది బాలికలు వున్నారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణకు చెందిన 92, ఇతర రాష్ట్రాలకు 69మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ తనిఖీల్లో చిన్నారులచే పనులు చేయించుకుంటున్నా ఏడుగురు షాపు యజమానులపై కేసులు ఏడు కేసులు నమోదు కాబడ్డాయి. అలాగే ఈ తనిఖీల్లో ఉత్తరప్రదేశ్ చెందిన బాలికను దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించదమైనదని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని. ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై బాలల న్యాయ చట్టం అనుసరించి చిన్నారులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
