మహిళను చంపి బిర్యానీ చేసిన కేసులో అనుమానితులు
* మహిళను చంపి అవయవాల బిర్యాని..
* శరీర భాగాలు.. రైలులో సూట్‌కేస్
* నిందితుల కోసం పోలీసుల వేట
ఆకేరు న్యూస్, చెన్నై: మనుషులు మృగాలవుతున్నారు..మానవత్వం మచ్చుకైనా కానరావడం లేదు..మనిషిని హత్య చేయడమే అత్యంత దారుణం అంటే… హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బిర్యానిగా వండేయడం చూస్తుంటే.. అసలు వీళ్ళు మనుషేలానా అన్న చర్చ జరుగుతోంది. ఈ అమానవీయ ఘటనకు కారణమేంటి.. నిజంగానే ఆ మహిళ అవయవాలతో బిర్యానీ చేశారా.. అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చైన్నై లోని గూడువాంచేరి అనే ప్రాంతంలో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
* సీసీ టీవీల ఆధారంగా ..
ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆగ్రా చేరిన తర్వాత ఒక ట్రాలీ సూట్‌కేసులో కుళ్లిపోయిన మానవ శరీర భాగాలు గుర్తించారు. అవి 38 ఏళ్ల హయాతున్ నిషాగా పోలీసులు గుర్తించాయి. ఆమె స్వస్థలం విషయంలో సందిగ్ధత ఉంది. ఒడిశా , తమిళనాడులోని పరమకుడి అన్న విషయాం తేలాల్సి ఉంది. ఆగ్రాలో దొరికిన సూట్‌కేస్ మూలాలను వెతుకుతూ దర్యాప్తు బృందాలు చెన్నై వరకు వచ్చాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన 350కుపైగా CC TV దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అందులో ఒక యువకుడు, యువతి కలిసి ఎరుపు రంగు ట్రాలీ బ్యాగ్‌ను తీసుకువచ్చి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ఉంచి ఆ రైలు దిగి సబర్బన్ రైలెక్కి వెళ్లిపోయారు. సీసీ టీవీల ఫుటేజీల ఆధారంగా పోలీసులు చివరకు గూడువాంచేరి ప్రాంతానికి చేరుకున్నారు. ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి గదిలో తనిఖీ చేశారు. అక్కడ పెద్ద వంటపాత్రలో మరిన్ని మానవ శరీర భాగాలు కనిపించాయి. ఆ ఇంట్లో దొరికిన అవశేషాలు హయాతున్ నిషావేనని పోలీసులు భావిస్తున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు.
*నిజంగానే ‘మనిషి మాంసంతో బిర్యానీ’ వండారా?
ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. పెద్ద బిర్యానీ పాత్ర మూతను మైదా పిండితో సీల్ చేసిన స్థితిలో పోలీసులు గుర్తించారు. పాత్రలో మానవ శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటితో పాటు కూరగాయలు కనిపించాయి. బియ్యం, కూరగాయలతో శరీర భాగాలను కలిపి బిర్యానీ వండారా ? అనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు మాణిక్ ఉద్దీన్ లస్కర్అ నే యువకుడు, అతడి భార్య భాగమతి మాఝి కోసం గాలిస్తున్నారు. మాణిక్ అసోంకు చెందినవాడని, భాగమతి ఒడిశాకు చెందిన యువతిగా తెలుస్తోంది. ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. వీరిద్దరూ గూడువాంచేరిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారని, హయాతున్ నిషా కూడా కొంతకాలంగా వారితో కలిసి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిషా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో గూడువాంచేరి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శరీర భాగాల గుర్తింపు, CCTV ఆధారాలు, గూడువాంచేరి ఇంట్లో లభించిన అవశేషాల ఆధారంగా అమె నిషానేనని ప్రాథమికంగా గుర్తించారు.
* బిర్యానీ ఎందుకు..!?
క్షణికావేశంలోనే.. కుట్ర పూరితంగా హత్యలు జరుగుతుంటాయి.. కొన్ని సార్లు కసీదీరా కత్తితోనే ఇతర ఆయుధాలతోనే దాడి చేస్తారు.. మరో వైపు ఇటీవల హత్య జరిగిన తర్వాత ముక్కలుగా చేసి పోలీసులకు దొరకకుండా నానా రకాల ప్రయత్నాల చేస్తుంటారు.. గూడువాంచేరి హత్య కేసులో మాత్రం హత్య చేయడమే కాకుండా తీరిగ్గా ముక్కలుగా చేసి బిర్యానీ చేయడం లాంటి అంశాలు అంతుపట్టకుండా ఉన్నాయి. నిందితులు తినడం కోసమే బిర్యానీ చేశారా..? లేదా ఇతరులకు పంచి పెట్టారా..? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. హతురాలితో విభేదాల కారణంగా బిర్యానీ వరకు సమస్య వెళ్లిందా లేదా .. మానసిక రుగ్మతలతో బాధపడుతూ నిందితులు ఇలాంటి ఘోరాలక పాల్పడుతున్నారా అన్న విషయాలు విచారణలో తేలాల్సి ఉంది..
—————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
